ఆకర్షణ నుండి అంకురించ లేదు ఈ అక్షరాలు....
కాలక్షేపానికి కనికరించి కలపలేదు ఈ పదాలను....
మనసుకు,మెదడుకు జరిగే అంతర్మథనం నుండి పురుడు పోసుకున్న భావాలు....
విన్న మాటలకు,జరిగే పనులకు పొంతన కుదరక నలిగిన మనసు ఆవేధన....
తెల్లనివన్నీ పాలని నమ్మే మనసు చూసిన అసలు నిజాలకు మధి పడే ఘోష ఇది....
ఒకరోజులో పగలు,రేయి లాంటి తేడాలు ఎలాగో మనిషిలోని ఘడియకో మార్పును చూసి పలికే మాటలివి...
నమ్మి చెడిన మనసు ముక్కలై నేల రాలితే ఒకచోట పేర్చాలని,మళ్ళీ జీవం పోయాలని,నమ్మకాన్ని ఊపిరిగా పోయాలనే తపన ఇది....
పిచ్చితల్లినో,గడుసు పిల్లనో తెలియచెప్పిన గతరోజుల వెక్కిరింతలను విని విసిగిన మనసు ఆక్రోషం....
పంచుకోలేక,తుంచుకోలేక నలుగుతున్న ఆత్మ నివేధన ఇది...
అక్షరాలుగా మరి నను నేను ప్రశ్నించుకుంటూ,నిందించుకుంటూ నాకు నేనే ఔషదంగా మారుతున్న తీరుకు నిదర్శనం ఈ రాతలు...
నమ్మడం అనే తప్పుకు కాలం వేసిన శిక్ష ...జీవితంలో చెరిగిపోని ముద్రగా మిగిలింది
ఆ భారాన్ని మోయడానికి నన్ను నేను సిద్దం చేసుకునేందుకు దారి ఈ అక్షరాలు...
గాలి వాటుగా వచ్చి కంటిలో నలుసై చేరింది ఒక ఙ్ఞాపకం...కదిపితే కన్నీటి జలపాతం...ఉంటే లోకాన్ని కూడా చూడనివ్వని మాసిక....
ఈ పదాల అర్చన...ఆవేదన...నివేదన...ప్రేమ...విరహం...నిరీక్షణ...అభిమానం...ఆరాధన...కోపం...అన్నీ కలిసి "అరుణిమలు"
...............................అరుణిమలు...
No comments:
Post a Comment