నువ్వు నన్ను ఎందులోను గెలవ లేవు లే
అనే నీ నవ్వులో నా గెలుపును చూస్తున్న....
నీ పెదవి పై చిరునవ్వుకు
కారణం నేనవ్వడం కన్నా గేలుపేముంది ఈ లోకంలో..
నీ నవ్వులో నేను దాగే
ఆ కొద్ది క్షణాల కోసం ఎన్ని ఓటములు అయినా ఇష్టమే...
కావాలంటే...నిన్ను పందానికి పిలిచి మరీ పోరాడి ఓడిపోనా
నా పొగరు నీ నవ్వులో గర్వంగా వెలుగుతుంటే తనివి తీరా నిన్ను నా కళ్ళల్లో దాచేసుకోనా...
ఈ చిన్ని చిన్ని బహుమానాలే కదా నా సంపద, నా బలం...
ఇలాంటి ఙ్ఞాపకాల ఖజానా కోసం ఎన్ని యుద్దాలకైన నే సిద్దమేనోయ్...
✍️అరుణిమలు