Wednesday, 8 August 2018

తాను నేను

నీ తోడులో ఏముందోయ్ గమ్మత్తు
ధైర్యం చేతిలో చేయిగా కలిసిపోయింది..

నీ పలకరింపులో ఏ మాయ ఉందో
ఏకాంతాన్ని తరిమేసింది..

ఆ చూపులలో దాగిన చల్లదనం
మనసుకు ఇక్కడ చందనోత్సవమే..

మౌనం కూడా మాట్లాడుతుంది
నువ్వు కళ్ళతో పలకరిస్తే..

ఏమవుతుంది
నువ్వు పక్కన ఉంటే...

లోకం అంతా శూన్యంలా మారిపోతుంది
నువ్వు నేను మన ఏకాంత వాసమై..

కాలం పరుగులు పెడుతుంది
లయ తప్పని మన అడుగులు జతలో..

ఆకలే లేదాయే
నిజమైన ఆశలతో జీవితం నిండిపోయాక..

నా వాడివనే భరోసా
నా_నీ అనే పదాలను కలిపేసాయి కదూ "నాని" అని
అదే అదే మనం అని..

✍️అరుణిమలు

No comments:

Post a Comment