మాటలు రాని మనసు పలికే భాషే కన్నీరు..
మనసు మూగదే కానీ
భావాలు నిండిన నిండు కుండ కదా..
చిన్న తాకిడి చాలు చలించి పోయేందుకు
చేజారితే చాలు మళ్ళీ చేజిక్కను అంటుంది
ఉఫ్ అంటే చాలు చెదిరి పోతాను అంటుంది
ఏదైనా దాని భాష కన్నీరే
ఉబికి వస్తూ ఒలికి పోతుంది..
ఆనకట్టలు లేని
ఆవలి తీరాన్ని తాకేందుకు..
వెచ్చని చినుకును తాకి చూడు
చలించే నీ మనసు చెబుతుంది దాని కథ..
వినగలిగితే
ఇంకొకరి కన్నుల్లో నువ్వో చినుకై చేరవు..
✍️అరుణిమలు
No comments:
Post a Comment