చూపులతో నీ ఎదపై లయబద్దంగా నర్తిస్తూ
లిఖిస్తున్న నువ్వంటే ప్రాణమంటూ..
తాకీ తాకని చూపుల
చక్కిలి గింతలలో తడిపేసానా..
గోరు గిచ్చుళ్ళు కూడా
చిలకకొట్టుడులా రుచిగా ఉన్నాయా..
వాలిన చూపులని హత్తుకోకోయ్ మత్తులో నుండి లేవడానికి ఎన్ని యుగాలు పడుతుందో..
బదులు ఇవ్వమన్నాను అని
నీ చూపులకు పని చెప్పకే..
భరోసాగా నీ బాహువులలో బంధించేసి
నుదుటిపై నీదనే ముద్రను అచ్చు వేసేయ్..
✍️అరుణిమలు
No comments:
Post a Comment