Wednesday, 8 August 2018

తాను నేను

అక్షరాలను పారబోసి అందులో తప్పి పోవాలనుంది...
నన్ను నేను...నా కోసం వెతుక్కోవాలి

నాకంటూ నాలుగు పదాలను కూర్చాలని..
నేనంటు ఆ పదాలలో జీవించాలని‌ ఉంది..

అక్షరాలలో మునుగుతూ నా మనుసును ముంచేయాలని..
ఎన్నో పెదవి దాటని భావాల భారాన్ని మౌనంగా జారనిచ్చేయాలని ఉంది..

మాటలకు అర్ధాలను వెతకనా
చేతలకు చలనం మరువనా

మనసుకెంత చులకన మనిషంటే..
కర్కశంగా ఎదను గాయాలు పాలు చేయడం
ఎద కోతలను వేడుకగా చూడటం..

అలుపే లేదు నీ ఆటకు
అలుసే కదా నీ వశమైన నేనంటే నీకు

వాడుక నీది...వేడుక నీది
వేదన మాత్రం ఈ అక్షరాలదే

✍️అరుణిమలు

No comments:

Post a Comment