ఎదురు చూసే దారులు మూతపడ్డాయి
అవకాశాలకు అడ్డుకట్ట వేసావు కదా..
గుప్పిట దాచిన ఎన్నో ప్రశ్నలకు
జవాబు నీ నడకలలో చూసాక...
ఏముంది లే అని పక్కన పెట్టిన
నీ చేతలకు అర్ధాలు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి ఇప్పుడు..
అవకాశాలకు...అవసరాలకు
తేడా ఇదేనా అని చూస్తూ ఉండిపోయా..
దూరం చేసుకోలేను ఇష్టాన్ని
దగ్గర చేసుకోలేను కష్టాన్ని
నా ఇష్టం-కష్టం నువ్వే కదూ..
ఆటలో అరటిపండునేమో..
పోనీలే ఓడించి గెలిపించేసావు తప్పటడుగు వేయకుండా...
ఎటు నుండి వచ్చావో గుర్తు లేదు
కానీ...ఎలా ఎటు కదిలి పోయావో మాత్రం కళ్ళలో ఉండిపోయింది...
కాలక్షేపం మాత్రం కానోయ్
కనికరం కోరని కన్నీరుగా మిగిలిపోతా కానీ...
✍️అరుణిమలు
No comments:
Post a Comment