Friday, 28 February 2020

తాను నేను

మనసు అప్పుడు, ఇప్పుడు ఒంటరిదే
ఒక్క నువ్వు లేవనే మాటే తప్ప..

నీకై ఎదురు చూపులలో గడిపిన కాలమే ఎక్కువ
ఎలా ఉన్నావనే పలకరింపుకు ఆశ పడిన రోజులే ఎక్కువ...

అందరు బాగున్నార, ఎలా ఉన్నారనే పలకరింపే తప్ప..
ఏం, ఎలా ఉన్నావు అంటే
నువ్వు ఇలా ఉంచావని నన్ను నేను చూపిస్తే చూడలేను అనుకున్నావ..

నీకు తెలుసు నువ్వు ఏం చేస్తున్నావో
ఏం ఇస్తున్నావో
నాకై నిన్ను నువ్వు పంచలేనప్పుడు
దేనికోయ్ ఈ బంధం..

నువ్వు ఏకాంతంగా గడిపే కాలంలో
నా ఆలోచనలు ఏనాడైనా నిన్ను పలకరించాయ
అని అడగాలని ఉన్న.... జవాబు రాదని తెలిసే ఆగిపోయాను..

నిన్ను నాకు అలవాటు చేయకూడదు అనుకున్నప్పుడు..
మనసుతో ఈ చెలగాటం దేనికి..

పదిమందిలో నన్ను ఒంటరిని చేయగలిగే నీ తలపులు...
ఏకాంతంలో నాతో యుద్ధం చేస్తున్నాయి
ఏం ఆశిస్తున్నావని
ఏం పొందావని..

అప్పుడు ఆశగా చూసే దానిని
ఎప్పుడు నీ రాక అంటూ
ఇలా వచ్చి అలా మాయమయ్యే ఆటలు నువ్వు ఆడుతుంటే ఎదకి అయ్యే గాయాలను
అక్షరాలుగా పోసి పేర్చే దానిని..

ఇప్పుడు ఙ్ఞాపకాలు తప్ప
ఆశలు లేవు
ఎదురు చూపులు లేవు
నీ ఆలోచనలలో నన్ను వెతుక్కుంటూ
నాతో నేను నిన్ను నీడగా 
నింపుకుని సాగిపోతున్న..

✍️అరుణిమలు

No comments:

Post a Comment