Friday, 28 February 2020

తాను నేను

ఏవేవో ఆలోచనలు
కాదు సందేహాలు
అది కాదేమో..

ఏదో భయం
నిన్ను తెలుసుకున్నాన పూర్తిగా..

నీ అంతరంగాన్ని
చదివాన లేదా...

రేపటి వేపు
పడుతున్న నా అడుగులు
తీయని ఙ్ఞాపకాలేనా...

ఎక్కడెక్కడో
జరిగిన కథలలో
మన కథ ఒకటై మిగిలిపోదుగా..

నీకై ఎదురు చూస్తున్న
ఈ కనులు చూసేదంతా నిజమే కదా..

ఏదేదో గుబులు
నువ్వు లేని గడియలలో
నన్ను వెంబడిస్తుంటే..

అప్పుడే 
వచ్చి పిలుస్తావు..

ఏయ్...
ఏంటా పరద్యానం అంటు..

నిజమే 
ఏ దూరమో నన్ను
మాయ చేయాలని చూసిన ప్రతీసారీ..

చేయి అందుకుని
చేర దీసుకుంటావు..

ఇదే...
ఈ స్పర్శే
గుండెల నిండా ధైర్యాన్ని నింపేస్తుంది..

✍️అరుణిమలు

No comments:

Post a Comment