Thursday, 20 April 2017

తాను నేను

ఏంటోయ్ షేక్ స్పియర్ .....
పేరు ఉన్నది పిలవడానికే అన్నావు...
ఎక్కడోయ్ మరి ఆ పిలుపు...
బంధాలున్నవి భరించడానికే అన్నావు...
మరి ఇంతలోనే అలసిపోయావేంటోయ్...
ఇష్టానికి,ప్రేమకి అర్థం చెప్పావు...
మరేదోయి ఇప్పుడు ఆ ఇష్టం...ఆ ప్రేమ...
నాలుగు రోజుల దూరాన్ని భరించలేనన్నావు...
మరేంటోయ్ ఎదురుగా ఉండి కూడా...
పరాయి వాడిలా ఉలుకు లేకుండా ఉన్నావు...
నేను గురుతొచ్చిన ప్రతిసారి రాయమన్నాని...
మాటలు మాని లేఖలు రాస్తున్నావా ఏంటి...
ఈ మాటలు ఆ లేఖలు దేనికోయ్...
నీ మనసున మదిలే భావాలు...
నా మదిని తాకి అలలు అలలుగా
అలజడులు రేపుతునే ఉన్నాయి ఇక్కడ...
నువ్వేం రాసావు అంటావా...రాసానోయ్...
నీ లేఖలకు జాబులు నా చిరునవ్వలను అద్ది మరీ పంపానోయ్...
ఎక్కడా...అంటావేం... నీ పెదవులపై మెరిసీ మెరవని ఆ నవ్వును అడుగు చెబుతుంది...
నీ మౌనాన్ని అడుగు చెబుతుంది మన మనసుల చెప్పుకునే ఊసులను వినడానికే ఆ మౌనం అని...
ఇంకేంటోయ్ షేక్ స్పియర్...మూడుముళ్ళూ, ఏడడుగులు కాదోయ్ కావలసింది...
నీ గుండెలో పిడికెడంత చోటు చాలోయ్ ఈ జన్మకు...
ఈ జన్మకు మన మనసులలోనేగా మనం ఉండేది...
మళ్ళీ కలుసుకుందాం...నువ్వు నేను మాత్రమే ఉండే ఇంకో లోకంలో,ఇంకొక జన్మలో...
నిజమేనని నమ్మనీవోయ్ అవునా అనే మన మనసులను హరి....

...........అరుణని..........

No comments:

Post a Comment