Wednesday, 19 April 2017

మనసు

నిజంగా ఆడదానితో పోలిస్తే మగాడు బలహీనుడే మానసికంగా....తన వాళ్ళ కోసం ఎన్నైనా అనుభవిస్తుంది...వీళ్ళిచ్చే నిర్లక్ష్యం, చేతలు,మాటలు అన్నింటిని మౌనంగా భరిస్తుంది కాని ఆ ప్రభావం ఆ కారకుల మీద కూడా పడనివ్వదు...ఎప్పుడైనా మనసు అలిసిపోయి తన బాధను చెప్పుకున్న లేదా తిరిగి ప్రశ్నించిన ఆ మగాడు తట్టుకోలేడు పాపం...నీ మాటలు నన్ను బాధపెడుతున్నాయి అంటూ అసహనం చూపించేస్తారు...మాటలు వినడానికే అంత కష్టంగా ఉంటే మీ చేతలను అనుభవించిన ఎదుటి మనిషి స్థితి ఏంటి అన్న ఆలోచన రాదెందుకు...అలా అయితే ఆ మనిషి ఇంకెంత రియాక్టు కావాలి.. కాని నా వాళ్ళు కావాలి అనే ఇష్టం అంత కష్టం భరించడానికి కూడా వెనుకాడరే ...చెప్పుకున్న బాధే, చెప్పుకోకపోయినా బాధే వీళ్ళతో ఈ మగాళ్ళతో 😊

No comments:

Post a Comment