Thursday, 20 April 2017

తాను నేను

ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో అని ఘడియ ఘడియకు మది ప్రశ్నిస్తుంది ....
ఎదురుగా లేవనా ఈ ఎదురు చూపులు...ఎద నిండుగా నిండి ఉన్న నీకోసం ....
ఎదురుచూస్తున్న ఎదను ఏలగా రావేల .... ఇంకా ఎంతసేపోయ్ ఈ ఎదురుచూపులు...
చుట్టూ ఎందరుంటే ఏంటి నా చూపులు వెతికేది నీకోసమేగా...
పలుకులు పొడిపొడిగా ఉన్నాయి పరుగులే లేవు మాటల్లో... నీ పిలుపు కోసం ఎదురుచూస్తున్నాయి...
పెదవంచునే నిలిచిపోయింది చిరునవ్వు నువ్వు ఎదురుపడక అలిగిందేమొ మరి....
నీవు లేని వేళ ఏకాంతంతో సహవాసం నాకు ఇష్టం, అవును...ఆ ఏకాంతంలో నేను నా మనసేగా ఉండేది మరి....
సడే లేని చోట గుండె సవ్వడి చెబుతుంది నువ్వు నాతోనే ఉన్నావని...నేను నీతో ఉన్నానని
నా మనసుతో నేను ముచ్చటగా మాట్లాడుతుంటే ఈ ఏకాంతానికి కూడా కుళ్ళుగా ఉంది...
ఏంటా ముసిముసి నవ్వులు ఏం జరుగుతుంది అంటూ నస పెడుతుంది...
కసురుకుంది నా మనసు ఏకాంతాన్ని కాస్త ఏకాంతంగా ఉండనివ్వవా అంటూ....
ముంగురులు మోముగా గుండెను తాకుతున్నాయి...మన ఊసులకు ఊ కొడుతూ
.. ఊగిసలాడుతూ  ఊరిస్తున్నాయి కాలాన్ని ...
చీరకొంగుకు వేస్తున్న చిక్కుముళ్ళు చిరాకు పడుతున్నాయి ...ఏంటి ఈ హింస మాకు అంటూ...
పరాకులో పడ్డానేమొ కాలాన్ని గమనించలేదు కాని...ఇంకెంత సేపయ్యా మగడా ఈ ఎదురు చూపులు..
రావోయ్ మావ..రేయిని ఇలా ఏకాంతానికి కానుక చేయకోయ్...
రేతిరంతా జాగారమా....జాతరా ఏం చేద్దావయ్యా...
మరీ ఇంత పని పనికిరాదోయ్...నీ అసలైన పని నేనే అవ్వాలి నా తరువాతే ఏ పనైనా..
నేనేమన్నా తలపుకు వచ్చానా లేదా అసలు..ముందు ఆ విషయం అడగాలి నిన్ను రాగానే...రాకుండా ఎలా ఉంటాలే నేనున్నది నీకోసమేగా...
వేడి వలపుల సెగలు చల్లార్చగా ...ఈ వెదురును వేణువుగా మలచడానికి రావోయ్..
చిరు సవ్వడికి కూడ ఉలిక్కిపడి చూస్తున్న నువ్వు వచ్చావేమొ అని..అంతలోనే ఆశ, ఆ వెంటనే నిరాశ...
ఇలా ఎలా...కుదరదింక ...తొందరగా రాకుంటే ..

   ..............అరుణని.............

No comments:

Post a Comment