Saturday, 2 December 2017
తాను నేను
బాగున్నావా......
ఈ మాట పదేపదే మదిలో ప్రశ్నలా మెదులుతూనే ఉంది...ఈ మాత్రం అడగలేని దూరం మన మధ్య రాజ్యమేలుతోంది...గడిచిన ప్రతి క్షణం గతమౌతుంది కాని నిన్నలలో నువ్వు కూడా గతమై గతిస్తావనుకోలేదు...భవిష్యత్తు లేని బంధనంలో బందీని నేనైయ్యాను....ఈ గాలి, నీరు , భూమి, ప్రకృతి వీటిలో యుగాలు గడిచిన మార్పు రాలేదు కాని ఈ మనిషికి ఎన్ని కొత్త దనాలు కావాలో...అందరి ఆలోచనలు ఒకలా ఉంటే ఈ బాధలు ఉండేవి కావు కదా...
నా భావాలకు ఊపిరి పోసింది నువ్వు....నా అక్షరాలకు జతగాడివి నీవు....నా ఊహలకు రూపం నువ్వు...నా నిన్నటికి తోడు నువ్వు....నువ్వు రుచి చూపించిన ప్రేమకు పుట్టిన ప్రేమ ఇది....ఆనాటి ఇష్టానివి నువ్వే ఈరోజు కష్టానివి నువ్వే....నిన్ను కోరిన మనసు ఇదే,ఈ రోజు ఏమరపాటుగా కూడా చూడాలని కోరని మనసు ఇదే...నీకై నువ్వు వచ్చావు, అడగకనే దోసిట పోసావు ఆశలను....నీకై నువ్వు దూరమయ్యావు పిడికిడంత ప్రేమను వదిలేసి....ఇంకా ఎందుకిదంతా అంటావా నాకై నేను రాలేదు, నాకై నేను పోలేదు కదా అందుకే ఇదంతా...
మనసంతా నువ్వే కాని ఎక్కడ నువ్వు అంటే నాకు తెలియదు నీ జాడ...నా ప్రేమ నువ్వే కాని ఎవరని అడిగితే చూపించడానికి ఎవరు లేరు అక్కడ...మదినిండి పోయావు కాని మనిషిగా మాత్రం మిగలలేదు అంతే...నువ్వంటే వెళ్ళిపోయావు కాని నా భావాలలో నుండి, నా ఙ్ఞాపకాలలో నుండి,నా మనసు నుండి నిన్ను నువ్వు దూరం చేయలేవు...ఇదంత ఎందుకు ఇప్పుడు అంటావా...నా అక్షరానివి కదా నువ్వు నిత్యం అక్షరార్చన జరుగుతునే ఉంది కదా...ఈ అక్షరాలకు అందే ప్రశంసలో సగ భాగం నీదే అన్నాను కదా ఒకప్పుడు భాగం కాదు ఈ అక్షరాలతొ బాటు ప్రశంసను నీకే అంకితం ఇస్తున్నాను అని చెప్పడానికే బుజ్జి...నాలో నేను నీతో మనమై జీవిస్తున్న అది చాలు....కష్టమనిపిస్తే ఓదార్చడానికి కన్నీళ్ళు ఉన్నాయి, సంతోషమనిపిస్తే పెదవిపై చిరునవ్వు ఉంది....ఆ కన్నీటికి ఈ నవ్వుకు జీవం నువ్వే రా...
*ఈ అరుణిమల అక్షరమాల నా అనే నా మనసుకు అంకితం....
✍️అరుణిమలు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment