Saturday, 2 December 2017
తాను నేను
అలా నువ్వు వదిలి వెళుతూ ఉంటే...
నీ వెంట వచ్చేది నీ నీడకు జాగ్రత్తలు చెప్పేటందుకే...
నా శ్వాసను నిన్ను నమ్మి పంపుతున్నా...
గడియ కూడా వదలకని ఒట్టు వేసి మరి.. గడప దగ్గర మనిషిని ఆగుతున్న...
ఆత్మను నీ వెంట జంటగా వదిలేసి...
అలా నువ్వు వెళుతూ వెళుతూ..
వెనుదిరిగి చూసిన చూపులలో నా మనసు చిక్కుకుని నీతో సాగుతుంది...
వెళ్ళొస్తా అనే మాటలలో భరోసా గుండెలను సముదాయిస్తుంది...
కళ్ళతో జాగ్రత్త అంటూ నువ్వు నవ్విన చిరునవ్వు ధైర్యాన్నీ దోసిట నింపుతుంది...
గడప మీద ఆగిన నా అడుగును వెనుకకు తీసినా...
నా ఎదురు చూపులు ఆ గడపకు పసుపు పూతలా మారిపోతాయి...
ఎడబాటులో తడబడుతున్న తనువు తహతహలు..నిన్ను మళ్ళీ చూసే వరకు తనివి తీరదు...
ఓయ్...నీలో సగం ఇక్కడ అసంపూర్ణంగా ఉందని మరువకు...
లోలోన గుబులును గుట్టుగా దాయగలను కానీ...
కళ్ళలో కలవరాన్ని దాయలేను రా...
స్వాగతం చెప్పడానికి మనసు ఉరకలు వేస్తుంది...
తొందరగా..........వచ్చేయ్
✍️అరుణిమలు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment