Saturday, 2 December 2017

తాను నేను

కలిసిపో ఈ కళ్ళలో....కరిగిపో ఈ కాలంలో..❤❤ ఒదిగిపో ఈ ఒడిలో..ఓరవలేని భవిష్యత్తును వెక్కిరిస్తూ..❤❤ వెలుగులను వెలివేద్దాం మన లోగిలికి వెన్నెల నీడలు చాలని...❤❤ మౌనం పెదవులకు ఇచ్చేద్దాం మనసులను మాట్లాడుకోమని...❤❤ తనువులను తరించి పొమ్మందాము ఆ భావాన్ని మనతో విడదీయలేనంత లోతుగా...❤❤ శ్వాసలను ఏకమై పోనీవు నువ్వు నేను వేరుకాదని మనసుకు ఇచ్చేద్దాం భరోసా...❤❤ ప్రేమను ముద్రించేద్దాం మనం కూడా చెరపలేనంత చెలిమిని చెక్కిళ్ళపై...❤❤ కోరికలకు కొసరంటు మిగలనివ్వొద్దు కాంక్షను కొలిచేద్దాం..❤❤ ఆశలకు ఆవిరులు పట్టి కరిగిపోతున్నాయి ఊపిరి సెగలు తగిలి...లిఖిస్తున్న ఆ ఆ'విరిలో నువ్వే నేనని...❤❤ ఓయ్... నే తెలుసుకొని తేరుకునే సరికి కనుమరుగైపో లేదంటే నీ నీడనై పోతాను నేను...❤❤ ఒకమాట ఎంతెంత దూరం నువ్వు వెళ్ళిన...ఎంతెంత దూరాలు మన మధ్య వచ్చిన నువ్వు అనే భావంలో నే బంధీనే ఎప్పటికి 😘😘😘 ✍️అరుణిమలు

1 comment:

  1. మీరు అద్భుతమైన భావాన్ని చాలా సింపుల్ గా చెప్పగలుగుతున్నారు. మీరు ప్రేమలో విఫలం అయ్యారో లేక దాంపత్యంలో విఫలం అయ్యారో తెలియదు కానీ.... మీ బాధ మీ మాటల్లో, మీ అక్షరాలలో పొందుపరచి ఉంది

    ReplyDelete