Saturday, 2 December 2017
తాను నేను
కునుకు జాడ లేదు.. కళ్ళు మూసి కలవరించినా...
కలలకు అంతు లేదు.. కలకలం రేపుతున్నా...
పగటి కలలను నిజమని నువ్వు చూపించావు...
అవే ఇప్పుడు పీడకలలై వెంటాడుతున్నాయి...
అందుకోవడం అంటే వాడుకోవడం కాదు...
ఇచ్చిన దానిని పొదివి గుండెలకు హత్తుకోవడం...
అవసరం తీర్చుకోవడం అంటే మనిషితో ఆడటం కాదు...
మనసును గెలుచుకోవడం అంటే మానసికంగా చంపేయడం కాదు...
ప్రేమంటే రెండు పదాలు కాదు...
ఫలిస్తే ఫలితం ఇస్తుంది...
విఫలమైతే విచ్ఛిన్నం చేస్తుంది మనసును...
రూపాయి పెన్ను ఋణం ఉండిపోయావు కదా...
అందుకే ఆ ఋణాన్ని ఇలా లిఖిస్తున్న...
మెలకువలో నీ తలపులు..
నిద్రలో నీ పలవరింతల తుళ్ళిపాట్లు..తప్పేలా లేవు...
తప్పించుకోలేని...తప్పుకుపోలేని...తిప్పలు తక్కువ పెట్టావా నీ సరదాల కోసం...
ముగింపుకు చేరవా అంటున్నా మూతి ముడిచేసి,చేతులు ఎత్తేసింది కాలం...నా వలన కాదంటూ...
ఇలా మనసులను కాల్చేసిన పండుగలనే చేసుకుంటావు కదా...
రోజు నీకు పండుగే మరి...రోజు చెప్పలేను కాని ఇవ్వాళ అందుకో నా పండుగ శుభాకాంక్షలు...
✍️అరుణిమలు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment