Saturday, 2 December 2017
తాను నేను
చదవాలని ఉంటుంది లోకాన్ని...
తెలుసుకోవాలని ఉంటుంది సాహిత్యాన్ని...
వర్ణనలలో విలీనం అయిపోవాలి అనుంటుంది...
భావాలలో బందీని కావాలనుంటుంది...
అక్షరాల కూర్పును కూడాలని ఉంటుంది..
కానీ, జీవితాన్ని చదివితే ఇంకా బాగుంటుంది ఏమో అనిపించింది...
నన్ను నేను చదువుకోవాలని మొదలు పెట్టిన ఘడియలు ప్రభావమేమో...
నిన్ను తీసుకొచ్చి నా ముందు ఉంచింది, చదివి చూడని...
నాలో నన్ను వెతకడం మానేసి నీలో నన్ను నేను వెతకడం మొదలు పెట్టాను...
ఇదేమి చిత్రమో లోకమంతా నీలో ఇమిడినట్టు కనిపిస్తుంది...
నీ చూపు తడిమిన చోటల్లా, ఏడేడు వర్ణాల ఇంద్రధనస్సు నీడలై నా మీద పరుచుకుంటున్నాయి...
నా భావాలలో లీనమైన నిన్ను అక్షరాలుగా లెక్కలు
వేస్తుంటే మనసు జంకుతుంది లెక్క తప్పుతానా అని...
నాకు నేను తెలియదు...నేనెవరు అంటే నిన్ను మాత్రమే చూపించగలను...
తాను ఎవరంటే నేనే అని కొంటె జవాబు ఇవ్వగలను...
మళ్ళీ మళ్ళీ నిన్ను చదువుతునే ఉన్నా, చదివే ప్రతీసారి నువ్వు కొత్తగా,వింతగా కనిపిస్తున్నావు...
ఇంతకి ఒక్కడిగా కనిపించే నీలో ఎందరున్నారో...
ఆ అందరిలో నేను ఎవరికి చెందానో ఇప్పటికీ అర్థం కాలేదు...
అర్ధాలకు అర్ధాలు చెబుతావు కానీ నువ్వొక అర్థం లేని పదానివి...
ఓయ్ శేషం........నువ్వెప్పుడు శసేషమే నీకు...నాకు కూడా...
✍️అరుణిమలు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment