Saturday, 2 December 2017
తాను నేను
నీ ఊహల ఉవ్విళ్ళు నా ఈడు కావిళ్ళు
నీ ఆశల జాడలు నా ప్రేమ ఆనవాళ్ళు
అల్లిన అల్లి బిల్లి కథలలో చిక్కుకున్న రైక విసురులు
నీ తోడు తొలేళ్ళలో పండిన నా పెదవి తాంబూలం
సిగ్గు సవరించేను కుచ్చిళ్ళ వరసలను
కన్నులను అలుముకున్న యవ్వనం
అరమోడ్పు నవ్వులను అద్దుకున్నాయి
లోకమా ఇటు చూడకంటూ
నేలను గీసే బొటనవేలిని చూసి మురిసి పోతుంది నా మురిపెం
ఎదురుగా లేవనే తలపుల వలపులలో బంధీని అయ్యా
ఎదురుపడకు ఎప్పుడు ఎదను అదుపు చేయడం నాతరం కాదు
నువ్వు మరచిని కాలాన్ని నా కన్నులలో బంధించి
మది కేన్వాస్ పై చిత్రించాను చూడగలవా
నువ్వనే రూపం ఈ ఊపిరిలో ఎలా ఉందో
✍️అరుణిమలు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment