Saturday, 2 December 2017
తాను నేను
కావలి కాస్తున్న మనసు గడపలో...
ఎదల మధ్య ఎడబాటు ఏంటోయ్ మనుషుల మధ్య కానీ..
మానసాన మంటలు రాజేస్తూ చలి కాచుకుంటున్నావుగా వెచ్చగా...
అందనంత దూరంలో ఉన్నావా, కాదే...
అద్దంలో కనిపించే చిత్రమల్లే ఎదురుగానే ఉన్నావు...
చింతలన్నీ చిరునవ్వు మాటున నక్కి చూస్తున్నాయి..
తడి కనుల నిండా నీ వెలుగులు నిండిపోయాయి..
ఎటు చూసిన తారల తోరణాలే.. పగటి పూట కూడా...
ఆకశానికి ఎంత ఆశ్చర్యమో..ఇంత ఆశ ఏమిటే తల్లి అని..
అవని కన్న బిడ్డను కదా...భారం ఎంతైనా బరువు తెలియదు...
గుండెల నిండా ఉన్నావు బంధానివై...ప్రాణానికి భారం కాని వాడివి నాకేం బరువు అవుతావు...
ఎదురు చూపుల వరానివై...వరించావు
నిరీక్షణకు నన్ను పరీక్షించమని అప్ప చెప్పావు...
వరం లాంటి శాపానివై...శయనించావు నా మనో మందిరాన...
కాచుకుని ఉన్నా......కనులు తెరిచే వేళ కోసం...
కనుల గడప సాక్షిగా...
✍️అరుణిమలు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment