Saturday, 2 December 2017
తాను నేను
ఆ చూపులతో ఇలా కట్టేయకోయ్..
కాలాన్నే కాదు నన్ను కూడా ఇలా స్ధాణువును చేయకురా...
నీ ఊపిరిని తాకిన గాలి నను తాకిందేమో...
అణువణువు పరవశించి పోతుంది తనువు...
లోలోపల రాజుకుంటున్న నువ్వనే కోరికను అణిచేందుకు మనసు ససేమిరా అంటుంది...
కళ్ళు కలవరిస్తున్నాయి నీ రూపాన్ని ఊహకైనా చూపించమని మెదడును...
అదరాలు అమృతాన్ని అద్దమంటున్నాయి నీ పేరు పలికి...
సిగ్గు సింగారించుకుంది నీ కోసమే నేనంటు...
ఇన్ని గిలిగింతలు పెడుతున్నావు ఎక్కడో ఉండి...
ఊరించే ఈ ఊసులకు ఊ కొడుతున్నావా మౌనంగా...
నన్ను నన్నుగా చూసింది నువ్వు...
నిన్ను నిన్నుగా చదివింది నేను...
ఈ దూరం చాలా దగ్గరగా ఉంది....బాగుంది
నీలా....నిను దాచుకున్న నా మనసులా చాలా బాగుంది..
✍️అరుణిమలు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment