Saturday, 2 December 2017
తాను నేను
నాలో నేను జీవిస్తున్న....
నువ్వు చెల్లా చెదురు చేసిన నన్ను నేను కూడగట్టడానికి...
కానీ చేతకాని దానిని అవుతున్న ఎందుకో..
అవును, ఏం చేసావు పది అబద్దాలు, నాలుగు మాయ మాటలు కొన్ని వాగ్ధానాల నీటి మూటలు ఇవేగా...
వీటికే ఇంత చిధ్రమయి పోయాన...
అవును నేను మనసున్న మనిషిని కదూ అందుకే ఈ యాతన...
వదిలేయడానికి నిన్ను నేను వాడుకోలేదు కదా...
పారేయడానికి పరాయి వాడిలా చూడలేదు కదా...
మరచిపోడానికి మతిలేని దానిని కాను కదా...
మనసును ఇచ్చాను, భద్రంగా దాస్తావని...
అడుక్కుని ఉంటే బాగుండేది...
ఇచ్చిన దానానికి ప్రతి ఫలం కోరకూడదనే జ్ఞానం నాకు ఉంది కనుక ఈ వేదన ఉండేది కాదు ఈనాడు..
విలువలను పాతేసిన పాత్రవని తెలియదే అప్పుడు...
రక్తసంబంధాలకు విలువ ఇవ్వని నీ దగ్గర విలువ కోరుకోవడం హాస్యాస్పదం...
కడుపు నిండితే చాలు నీకు అది కాకి ఎంగిలో,విస్తరో,ఎంగిలి విస్తరో ఏదైనా ఒకటే...
శిక్షించాలని ఉన్నా నా మనసుని శిక్షించడానికి చేతులు రాకా నా తనువును హింసిస్తున్న నీ ఙ్ఞాపకాలతో...
ఎలుగెత్తి గొంతు చించుకుని నీ పేరును అరవాలని ఉంది..
ఇదిగో నువ్వు ముంచిన నా కన్నీటిలో నే కలువనై వికసిస్తున్న చూడని...
చూడటానికి కళ్ళు, వినడానికి చెవులు, తెలుసుకోడానికి మనసనే లేని రాతి మనిషివి కదా...
ఓయ్....ఎవరు నువ్వు అంటావు కదూ...
నువ్వు చెరిపేసుకున్న నీ గతాన్ని నేను...
నీకు గతాలతో పని లేదు భవిష్యత్తు ప్రణాళికలు తప్పించి...హ్మ్ ఏ గతం నిన్ను కదిలించక పోవచ్చు కానీ రేపు.......
✍️అరుణిమలు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment