పొగడపూల తొడిమల్లే నే నిలుచున్న...
పున్నాగపూల పందిరిలో...
తూనిగల తోరణాల నడుమ...
మిణుగురునై నే మెరిసిపోతున్న...
నీ పున్నమి కాంతులు నన్ను తాకినంతనే..
సువర్ణ గన్నేరులా సొగసులు అద్దుకుని ఎదురు చూస్తున్న....
ఓయ్... నా చందమామ మబ్బుల మాటున వేసిన మునకలు చాలోయ్...
చలిమంటలు చెలితో కాచే వేళ చెరిసగమవ్వగ రావోయ్..
✍️అరుణిమలు
No comments:
Post a Comment