Saturday, 2 December 2017
తాను నేను
లోకాన్ని మరచి నిదురిస్తున్న నిన్ను చూస్తుంటే మనసులో ఎన్ని ఆలోచనలో....
పసిపిల్లాడిలా నిదురలో నువ్వు నవ్వుతుంటే ఈ మనసులో ఏవో కదలికలు...
నడి రేయిలో విహరిస్తున్న ఆ జాబిలొచ్చి అలిసిపోయానని నా ఒడిలో చేరిందా అన్నట్టు ఉంది...
నిండుగున్నావోయ్ నా మదిని కదిలించే మనోహరుడివై...
అల్లన నీ కురులను సవరించనా అని అనుకున్న కానీ నిన్ను తాకాలని లేదయ్య..
ఇలా నిను చూస్తూ నీలో కలిసిపోవాలనుంది...
నా ముంగిలిలో సేద తీరిన నా రాజు కళ్ళు తెరిచి చూసాడు చిలిపిగా నా అనువణువును తడుముతూ ఆ భానుడిలా...
రేయంతా నీకై పలవరించి,తపించి అప్పుడే చిగురు తొడిగిన చిగురాకులా నే ముడుచుకున్న నీ ముందుర...
నా ప్రేమంతా నీ చూపుల తాకిడికి కరిగి చిగురాకు అంచున చేరిన మంచు బిందువులా మెరిసిపోతుంది...
నీ ఆక్రమణ కోసం ఎదురు చూస్తున్నానేమో వేయి కళ్ళతో...
రవి కిరణాలు తాకిడికి మెరిసిన మంచు బిందువు సప్తవర్ణాలను సంతరించుకోని తనని తాను అర్పించుకొని ఆవిరై నేలను చేరినట్టుగా నీలో కరిగిపోయా...
ఓయ్ ఇక్కడ ఉన్నది కామం కాదోయ్ కాంక్ష మాత్రమే...
మనసును జతచేసి అర్పించిన తనువు తాంబూలం మాత్రమే...
పండిన మన బంధమే అందుకు నిదర్శనం...❤❤❤❤
✍️అరుణిమలు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment