ఎన్నో చెప్పాలనుకుంటా నీతో
ఏవేవో అడగాలని..
ఏదేదో చేయాలని..
నిను చూసిన మనసు
నీ ముందు గువ్వలా వాలిపోతుంది..
నీ మాటలలో పడి ఊ కొడుతూ
నీ నవ్వులలో నగిషీనై మెరుస్తూ
నీ ఎదపై పసిపాపలా వాలిపోయి
ఏదో చెబుదామని కళ్ళు తెరిచినంతనే
నువ్వు ఎక్కడ..
కంటిపాపలో ఏదో కలవరం
ఎలా వచ్చావు
ఏమయ్యావని..
కలలు కన్నానా..
పగటి ఊహల్లో
నన్ను నేను మరచిపోయానా..
నీ ఎదపై నా చేతి రాతలు అబద్దమా
నిను హత్తుకున్న వెచ్చదనం నిజం కాదా
అల్లరిగా నే చెరిపిన నీ జుట్టు...
అన్ని కలవరింతలే
హ్మ్.......
తొందరగా వచ్చేయ్
ఓయ్...
అయితే ఇవన్నీ నిజాలు చేద్దాం
లేదా గొడవ ఆడేసుకుందాం..
ఏదో ఒకటి చేసేద్దాం
దూరాన్ని మాత్రం చెరిపేద్దాం
రెండు మనసుల సాక్షిగా..
✍️అరుణిమలు
No comments:
Post a Comment