నే ఊహించని ఊహలు
నీ చేతిలో రూపం పోసుకుంటున్నాయి...
నే ఏనాడు ఆశించని ఒక మనసు
నన్ను వెతుకుతూ నీలా
నాకు ఎదురు వచ్చి ఈ ఎదలో దాగుంది...
నే కనని కలలు
నిజమై కలవర పెడుతున్నాయి..
నీ ముందర పడని ఈ పదాలు
అక్షరాల మాలగా మారి నిన్ను వరించేందుకు సిధ్ధమంటున్నాయి..
నీ వెంట నడిచే
కోరికల కోటలో నేనో మహారాణినే కదూ..
ఏనాడు నే చవి చూడని
సాంగత్యం అనే రుచిని నువ్వు గోరు ముద్దలుగా అందిస్తున్నావు..
ఎద విందులో ఎన్ని ముద్దులో
చేయి విడువని భరోసా
చెలిమిని వదలని అడుగుల జత
నుదుటి పై కదిలే నీ పెదాల రచనలో
నువ్వు లిఖించిన నమ్మకం గుండెలను తాకుతుంది..
ఇంకేం కావాలోయ్...
మరో జన్మకు ముందస్తు హామీ తప్ప...
✍️అరుణిమలు
No comments:
Post a Comment