ఎదురు చూపుల దారులలో
ఈ ఆలోచనలు చేసే ప్రయాణాలు ఎన్నో...
అలసి పోని కన్నులకు
నీ రూపమే ఆయువు పోస్తుంది..
రెప్ప వేయనివ్వని ఆరాటం
నీ రాకను తనివి తీరా చూడాలని..
ఎంతెంత దూరమో
నువ్వు చెంత లేని ఘడియలు..
వేచి వేచి ఉన్న ఎద
నీ ఎద పై సోలిపోయే నిముషాలు..
నిన్ను హత్తుకుని
క్షణ కాలం ఆగిపోయే నా ఊపిరి..
ఏకాంతాల కాలాన్ని
వడ్డీతో సహా నీ నుండి తిరిగి తీసుకునే క్షణాలు..
అన్నిటిని అనుభవించేయని ఇలా
గంధపు చెక్కలా నీలో కరిగిపోతూ..
నిన్ను విడువని కౌగిలి నడుమ
గాలిని కూడా చొరబడనివ్వకు..
ఒంటరి దేహానికి
జంటగా మారి శిక్షను అనుభవించేయ్..
✍️అరుణిమలు
No comments:
Post a Comment