Thursday, 14 November 2019

తాను నేను

మనసు అలసిన, శరీరం అలసిన ప్రతీసారీ
నీ ఒడి కోసం వెతుకుతా....

ఎప్పుడు నిరాశే మిగులుతుంది
ఆశలను తుంచేసి...

కాసింత పలకరింత, కూసింత చేయూత
కూడా ఎండమావేనా...

ఎవరి పలకరింపుకు
ఈ మనసు పులకరించదు ఎందుకో...

ఎందుకో నీ పిలుపు కోసం
తనువెల్లా కనులై ఎదురు చూస్తుంది...

కాలక్షేపం కోరిక కాదు నాది...జీవితాంతం మోయమనే భారాన్ని కాను...
మరి ఎవరు నువ్వు అంటే మన మనసులకే తెలుసు....

ఓయ్... అని నువ్వు అంటే.....
ఏ లోకాన ఉన్న
ఏ చింతలో ఉన్న
నీ ముందు వాలిపోవడమే తెలుసు ఈ మనసుకు

ఏయ్... అని కసిరిన, నన్నేగా అని
నన్ను నేను సర్దుకుని, నచ్చచెప్పుకోవడమే నేర్చుకున్న..

ఎందుకో తెలియదు
అదేం విచిత్రమో మరి

నువ్వే మాయవో
నేనేం వింతనో మరి

నీ నుండి కొంచెం ఆశించి, ఎక్కువ నిరాసపడిన...
నిన్ను మాత్రం నా వలన నిరాశపరచలేని
ఈ లక్షణానికి....... ఏమివ్వను ఋణం తీర్చుకోవడానికి..

✍️అరుణిమలు

No comments:

Post a Comment