విశ్రాంతి లేని మనసు
అటు, ఇటు, ఎటో తిరుగుతుంది...
దేహానికి అలుపుంది
ఆలోచనలకు తప్ప...
నా ఆలోచనలను ఆక్రమించేసి
నాతో నేను చేయని, చూడని ప్రయాణాలు చేయిస్తున్నావు..
ఈ ఎద కష్టం నీ ఇష్టం ముందు
ఎంత అంటే..
నువ్వు నా కళ్ళల్లో
కళ్ళు పెట్టి నన్ను చదివేంత...
నన్ను నేను నీ ముందు దాచలేక
నువ్వు దోచేసిన మది ముచ్చట్లు చెప్పలేక..
కనికరం లేని నీ చిరునవ్వుల కోతలో
నేనో తీయని గాయాల పాలవుతున్న...
ఈ దేహంలో నువ్వు చేరని చోటేది
నీకు తెలియని దారేది నన్ను శోధించేందుకు..
గిచ్చి గిచ్చి ఆట పట్టించే నీ మాటలలో
నేనో అల్లరినై నిన్ను అల్లేసుకుంటున్న..
ఓయ్......నడిరాత్రిలో
మరో మేలుకొలుపు పాడుకుందామా..
మరో సంగ్రామానికి నాంది పలుకుదామా..
కలిపేసుకోవోయ్
మరో జన్మకు కూడా దూరం రానంత దగ్గరకు..
మరో ఇష్టానికి అంటు చోటేదని అడిగేంతలా..
✍️అరుణిమలు
No comments:
Post a Comment