అలలా వస్తావు అల్లరి చేస్తావు
ఒడ్డున ఙ్ఞాపకాల కోతను మిగిల్చి పోతావు..
ఇసుక తెన్నెలపై రాసుకున్న పేరులు చెరుగుతుంటే
మళ్ళీ మళ్ళీ లిఖించడంలో ఏదో ఆనందమోయ్..
అలవై తీరాన్ని కౌగిలిలో బంధించిన క్షణ కాలంలా
నీ ప్రేమ బంధనంలో బంధీనై పోయా..
ఎంత ఆశో ఈ పిచ్చి మనసుకు
ఇష్టంగా వచ్చిన నిన్ను నా వద్దే ఆపేయాలని..
అలుపెరగని సంద్రానివే నువ్వు నిలకడ ఏది
అలుపెరగనిదే ఈ మనసు కూడా నీకై ఎదురు చూడటంలో..
మనసులో నీ ఆలోచనల తుఫానులు ఎన్నో
అలజడి రేపుతుంటే
చిరునవ్వుల తెరచాపనై నీకోసం పయనిస్తున్న...
వెన్నెల నీడన వయసు తపస్సు చేస్తుందోయ్
నీ జతగా ఆ తీరంలో అడుగులు వేయాలని..
ఈ కంట నీరు ఉప్పనే
నువ్వు రాని రోజున ఇదే ఉప్పెనై నన్ను ముంచేస్తుంది కూడా..
పేరులో భాగం
జీవితంలో చోటు కాదోయ్ ముఖ్యం
మనసుతో మనువు కావాలి
ఇచ్చేస్తావా
కొద్ది చోటును నాదని
పంచేస్తావా
పట్టపురాణి చోటును నాకై
✍️అరుణిమలు
No comments:
Post a Comment