ఇష్టం ఇద్దరిని దగ్గర చేస్తుంది
బాధ్యత బందీ చేస్తుంది
కొన్ని బంధాలకు లొంగడానికి
కారణం తెలియదు
ఎందుకు...
ఎలా....
ఈ ప్రశ్నలకు జవాబు తెలియదు..
నీ చుట్టూ తిరుగుతున్న ఆలోచనలు
నిన్ను వదిలి రాని మనసు
నీకై నలుదిక్కుల నడుమ కాచుకుని ఉన్న చూపులు
ఎన్నెన్నో జన్మలు వేచినట్టు గడచిన కాలం
నువ్వు వచ్చిన క్షణంలో భ్రమలా అనిపిస్తుంది..
రెప్ప పాటు కలలా
ఇలా వచ్చి అలా నువ్వు కదిలి పోతుంటే
కనుల మూలన దాగిన కన్నీరు
తొంగి చూస్తూ జారిపోతుంది మౌనంగా
ఎందుకీ ఈ నిరీక్షణ
నువ్వు వద్దు
నీ మాటలు వద్దు
ఒంటరి ఈ ఆలోచనలు వద్దు
ఆ ఎదురు చూపులు వద్దనిపిస్తుంది
అంతలోనే
నిన్ను వదిలి నేనెలా
నువ్వు లేకుండా ఎలా
నీ చోటున ఇంకొకరు ఎవరో
ఈ ఊహకు ఉలిక్కిపడి తనను తానే నిందించుకుంటుంది
ఓయ్......
కసిరినా, విసుక్కున్న
అలిగిన, వద్దన్న
పొమ్మన్న, రమ్మన్న
ఈ జన్మకు నువ్వేనోయ్
భరించేద్దాం ఒకరినొకరు ఇలా
ఒకరి కోసం ఒకరమని
✍️అరుణిమలు
No comments:
Post a Comment