నీ ఊహాలలో కాలక్షేపం
నీ ఙ్ఞాపకాలతో జీవితం
అలవాటు అయ్యాక..
నువ్వు సమయం ఉంది
కలిసి గడుపుదామన్న
నాలో ఏ భావం కలగదేమో..
నీకు తీరిక అయ్యాక
నాకు నీకై ఆశలే
మిగలవేమో..
సమయమా తొందరపడి పోకే
అని వేడుకుంటున్న
నాలో మార్పులు కలిగే
ఆ క్షణాలకు..
వేచి వేచి
మనసు మరో మజిలీ
ఎందుకులే అని నిట్టూరుస్తుంది..
కాలం అంచున
కాచుకుని ఉన్నా
నిన్నే చూస్తున్న
నీలో నువ్వు మునిగి ఉన్నావుగా
నన్ను గమనించలేనంతగా..
ఎదలో ఏదో గుబులౌతుంటే
ఒక నవ్వు పలకరించింది
నీకు నువ్వు ఉన్నావని మరవకంటూ..
నిన్ను మరువలేను
నన్ను ప్రశ్నగా మిగిల్చుకోలేను..
✍️అరుణిమలు
No comments:
Post a Comment