Thursday, 14 November 2019

తాను నేను

మన్నించడం మనసుకు అలవాటు
మెదడుకు కాదే...

కష్టంగా ఉందోయ్
గడుస్తున్న ప్రతీ ఘడియ...

నీ ఙ్ఞాపకాలకు, ఆలోచనలకు
మధ్య మనసు నలుగుతుంటే
కళ్ళు తడుస్తున్నాయి...

కానీ వెనక్కి రావాలని లేదు
మళ్ళీ మళ్ళీ ఏకాంతాలతో సహవాసం చేస్తూ..

నేనా
మనమా అనే సందిగ్ధంలో
ఎన్నాళ్ళిలా..

నన్ను నేను మోసం చేసుకోవడం కన్నా
వాస్తవంలో జీవించాలి..

నువ్వు మాత్రమే లేవేమో
అలల్లా నీ తలపులు పలకరించి పోతున్నాయి..

నీ పేరే పలుకుతుంటే
పెదవికెందుకో ఈ తీయదనం..

నీతో గడిపిన క్షణాలను
తలచే కొద్ది ఇప్పుడే మొదలైందా మన కథ
అని కొత్తగా ఉంది...

దారులన్ని మూసేసా
కానీ...మనసు ద్వారం నీకై తెరిచే ఉంది ఇంకా..

నా ప్రేమవే నీవు
కానీ నా ఆశలన్ని
ఇసుక మీద రాసిన
అక్షరాలలా చెరిగిపోతుంటే ఆపలేక పోతున్న..

నా ఇష్టానివే
కానీ బెంగగా ఎప్పుడు మారావో
తెలుసుకోలేక పోయా..

బెంగ తీరేది
ఎలా........

తీరే దారి లేదని
తీరానికి ఇవతల ఆగిపోయా
నీ జ్ఞాపకాల తోడుగా..

✍️అరుణిమలు

No comments:

Post a Comment