Saturday, 9 November 2019

తాను నేను

ఎక్కడ నువ్వంటు వెతికే కళ్ళకు తెలుసు
నా చూపుల అలసట..
రెప్ప వేయని కనుపాపలలో దాచుకున్న
రూపం కోసం ఈ నిరీక్షణ అని..

ఏ చల్లని చోట ఆగి ఉన్నావో
నీకోసం ఎదురు చూసే మనసును మరచి..

అధికారంగా అడగాలని ఉన్న
సున్నితమైన బంధాలను బంధించలేని బలహీనత ఒకపక్క మౌనానికి వంత పాడుతుంది..

గుర్తింపు ఏదని అడిగేయనా
కథలు ఎన్నో నా ముందు వినమ్రంగా
జవాబై నిలబడతాయి..

మాటలున్న చోట చేతలు ఉండవా
చేతలున్న చోట ఈ నిరీక్షణ ఉండదు కదూ..

వెర్రి ఆలోచనలు
జరిగేది నమ్ముతూనే
ఇంకొక వైపు
అబద్దమని నమ్మబలకటం

కళ్ళల్లో చేరిన చుక్కలలో
ఎన్నో ఆశలను నింపుకన్నా ఏమో
నిరాశతో జారనివ్వలేక పడుతున్న కష్టం
కంటి గడపకే తెలుసు..

చీకటిలో మిణుగురుల్లా నీ కలలు
వెలుగుల ఊహలను సృష్టించి ఊరిస్తున్నాయి..

జాడ తెలియని బాటసారికై
గమ్యం ఎరుగని ఒక బంధం ఎదురు చూసే చూపులు ఇంతేనేమో..

ఫలితం ఒక ప్రశ్న
ప్రస్తుతం ఒక మౌనం

✍️అరుణిమలు

No comments:

Post a Comment