నిన్ను కలవాలంటే కలవరం
మళ్ళీ నిన్ను వదిలి రాలేనేమో అని..
నిను చేరాలంటే దిగులు
నిన్ను వదిలే క్షణాలు వస్తే ఎలా అని..
ఎటో విసిరేసిన నా ఆలోచనలను
ఒకచోట పేర్చి చూస్తే కనిపించేది నువ్వు..
ఎక్కడో దాగిన నా చిరునవ్వు
నీ పేరు వినిపిస్తేనే కనిపిస్తుంది..
నాలో నేనున్న
నా చూపులు ఆగింది నీ గడప దగ్గరే..
మనసేమో ముందుకు పదా అంటుంటే
వెనక్కి చూస్తున్నా ఎందుకో..
ఎదను లిఖించిన పేరు నీదే
పఠించేది నీ నామ జపమే..
అయినా వద్దు
నీ దగ్గర తనం..
అందని దూరంలో
అందాల ఆ చందమామలా
కళ్ళ ముందు మిగిలిపో ఒక జత కట్టని తోడుగా..!!
✍️అరుణిమలు
No comments:
Post a Comment