Saturday, 9 November 2019

తాను నేను

నువ్వో ఉద్వేగానివి నాలో
నన్ను నేను స్థిమిత పరచలేని భావోద్వేగానివి..

నన్ను వసం చేసుకున్న
మాయగాడివి ఏమో..

నీ వేపుకు పడిన
నా అడుగుల జాడలు గుర్తు లేదు కానీ..

నీ వెంట నేను వేసిన
ఆశల అడుగులు ఇప్పటికీ ఙ్ఞాపకమే..

ఏం కొత్తగా రుచి చూపించావో తెలియదు
కానీ.....నీ తోడులో ఏదో బలం అనిపించేది..

మాటల మాంత్రికుడివే
ఆ మాయాజాలం నుండి నువ్వు తట్టి లేపే వరకు తెలియ లేదు
నేను ఎంత దూరం నీతో వచ్చేసానో..

నీ దూరం ఏదో దిగులును మిగిల్చింది
కాలం ఆగినట్టే ఉంది, కలం మాత్రం ఆగనంది
నువ్వు మిగిల్చిన భావాలను ఒంపేయమని..

నీతో మాట్లాడాలి అనుకున్న ఎన్నో రోజులను
మౌనంగా గడిపేసానేమో..
ఇప్పుడు నాతో నేను మాట్లాడుకోవడమే మరచిపోయా..

అక్షరాలు నన్ను పలకరిస్తున్నాయి
వాటి లక్షణాలలో ఉన్నది నువ్వే కనుక..

సంవత్సరాలు మారిన ఈ పిచ్చి మనసు మారలేదు...
మారిందల్లా ఒకటే....నిన్ను చూస్తూ కూడా నువ్వు నాకేం కావంటు బతికేయడం..

నమ్మలేని నిజాలను నమ్మించి నువ్వు గెలిచావు
నమ్మకూడని నిన్ను నమ్మి నేను ఓడిపోయా..

✍🏻అరుణిమలు

No comments:

Post a Comment