నేనో తీపి ఙ్ఞాపకాన్నై
నీకు మిగిలిపోతా అన్నావు..
నిజమే...
కాలాన్ని వ్యర్ధం చేసుకోకూడదు...
నీతో గడిపే ప్రతీ క్షణాన్ని దాచేసుకోవాలనుకున్న..
నీతో ఉన్న ప్రతీ ఘడియని అందంగా మలచుకోవాలని ఆశ పడ్డా..
ఒక జీవితానికి సరిపడే సంపద నాకు కావాలి..
నిరాశలో ఉన్నప్పుడు నన్ను నవ్వించేవి..
నైరాశ్యంలో ఉన్నప్పుడు బలాన్ని ఇచ్చేవి..
నేను ఒంటరినే నా మనసు కాదనే నీ ఇష్టాన్ని నమ్మకంగా పొందాలని..
కన్నీరయ్యే వేళ నీ చిరునవ్వు రూపం నా కళ్ళ ముందు కదలాడాలని..
ధైర్యం దూరమయ్యినప్పుడు నా బలం నువ్వే అనే తలంపు నాలో పాతుకు పోవాలని..
ఎన్నో ఎన్నెన్నో అనుకున్న.
కానీ...జరిగేది జరుగుతున్నది ఇంకేదో..
నువ్వు పరుగులు పెడుతున్న కాలంలో నేను భాగం కాలేకపోయా
నేనంటు ఎవరని అనే ప్రశ్నల నడుమ చిక్కుకున్న..
పంచుకోవాలనుకున్న క్షణాలన్ని పరిక్షలు పెడుతుంటే..
నన్ను నేను నీకోసం నీకనువుగా మలుచుకునే క్రమంలో ఎన్ని గాయాలో ఈ మనసుకు..
అభిమానం ఒకపక్క..
నువ్వో పక్క..
వదిలేది ఎవరిని..!?
నువ్వు పిలిస్తే పలికి
నా పలుకు కి నువ్వు అందని రోజున మౌనమై గడిపి
ఎలా...నన్ను నేను నా నుండి తీసేసి నీ ముందు మోకరిల్లేది..
ఙ్ఞాపకాన్ని అవుతా అని నువ్వు అన్నావు...
గాయాలు మాత్రమే మిగులుతున్నాయి వింతగా..
అలసిపోయిన మనసు కష్టమైనా సరే ముందుకు కదలనివ్వడం లేదు..
నదినై నిను చేరా నీలో సంగమించేందుకు
దారేది, తీరేది ఆ సాగరానికి..
ఎదను కోతలు పాలు చేసి
మనసు దాహానికి కన్నీటిని ఇచ్చి
ఙ్ఞాపకాల గవ్వలని తన లోనే దాచేసుకున్నాడు..
✍️అరుణిమలు
No comments:
Post a Comment