Saturday, 9 November 2019

తాను నేను

కలిసి రాని కాలంలో
కొన్ని ప్రయాణాలు ఏ తీరానికి చేర్చవు..

అనుభవాల సుడిగుండంలో
అర్ధాంతరంగా వదిలి పోతాయి..

మనల్ని మనం పోగొట్టుకుని
మనసు తపిస్తుంటే..

ఙ్ఞాపకాల తుఫానులు
వెంబడిస్తూ వేదిస్తునే ఉంటాయి..

భవిష్యత్తు ఆశలను వదిలేసి
ఈ క్షణాన్ని జీవించడానికి పోరాటం..

నిదుర చెదిరిన రాత్రులలో
ఎన్నెన్ని కన్నీటి రాతలో..

ఏకాంతాన్ని వదిలి
పోవాలని చీకటి చాటున గడిపిన రోజులు..

నువ్విచ్చిన అనుభవాల సాక్షిగా
నాకు నేను విదించుకున్న అగ్ని పరీక్షలు ఎన్నో..

చితివై నువ్వు చెంతకు వచ్చావు
మనసును చిదిమేసి దహించి పోయావు..

కాలమే ఋజువు
నన్ను నేను నీ నుండి దూరం చేసుకుని
నాకు నేనుగా ఎలా మిగిలానో ఈ నాటికి అని..

✍️అరుణిమలు

No comments:

Post a Comment