Saturday, 2 December 2017
తాను నేను
కదిలే కాలానివో...కరిగే కలవో తెలియదు కానీ...
కాపు కాసే మనసుకు తెలియదా ఇది అత్యాశ అని...
పారే నదివే కానీ... తీరం తెలియని గమ్యానివి..
నీ వెంట దేనికో ఈ పరుగులు...
ఏకాంతమా కసరకే ఇంకెన్నాళని...నే జీవించేది నీతోనే అని తెలిసి కూడా..
కల్పిత కథవని సరిపెడదాం అంటే...కాచుకుని ఉన్న కన్నీరు మరిగిపోతుంది బాధతో...
కలం కన్నెలా మారి...నిన్ను సిరాలా మదినిండా నింపుకుని మరి రచిస్తుంది మనసు పుస్తకాన్ని...
అలుపెరుగని అడుగులు సవ్వడేదో వినిపిస్తుంది...కానీ నను చేరేవి...నే కోరే మనసువి కావవి...
నీ రుచులు ఎరిగిన నేను...నీ కోరికను కాగలిగాను కానీ నీ నీడ కోర లేకపోయాను...
నీ జాడనై నీ ఛాయను అయ్యాను కానీ... అది పడగ నీడని నువ్వనే విషం ఎక్కే వరకు తెలియ లేదు...
నువ్వు నాటిన ప్రేమ బీజాన్ని పీకేయడానికి చేతులు రాక...నే కరిగి దారనై జీవం పోస్తున్న...
నా ఆయువు నువ్వే... నీకు అందితే నీ చేతి బొమ్మను..అందకుంటే నా మనసు చేతిలో బొమ్మను...
మొత్తానికి నను మరచి నీ మాయలో చితికిన చిత్రాన్ని నేను...
✍️అరుణిమలు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment