రేయి అంతా నన్ను అల్లేసి..
నను ఆక్రమించి నువ్వు అలికిన నా మేను వాకిలి
మెరిసి పోతుంది నువ్వనే పేరుని అద్దుకొని..
మురిసిన మనసు పరవశించి నిన్ను హత్తుకుంది నా దప్పిక తీర్చే దాహానివని...
వేయి రాత్రులు కలిసి కరిగిన ఈ రేయి నీ నీడలో నటిస్తున్నాయి మీరెవరంటూ..
ఇద్దరా, ఒకరా అనే జవాబుకు నే బదులు ఇచ్చేలోపు ఎవరు చూస్తారో అన్నట్టు...
తెల్లారేసరికి కరిగి ఆవిరై జాడ కూడా లేనట్లు కనుమరుగై పోయావు...
ప్రతి రేయి నీ రాకకై ఎదురు చూస్తున్న మళ్ళీ మళ్ళీ చకోర పక్షిలా...
✍️అరుణిమలు
No comments:
Post a Comment