నింగిని ఏలే రాజువోయ్ నువ్వు...
వెన్నెల కాంతులను ఒంపుతున్నావా...
కప్పేసుకోనా నిన్ను మేని ఛాయలా...
దాచేసుకోనా నాలో నిన్ను ముత్యమల్లే...
నింపేసుకోనా నాలో నిండు పున్నమిని...
తురుముకోనా నా సిగలో ఆ జాబిల్లిని...
పోటు మీద ఉన్నది ఒడ్డుకు చేరడానికి కాదోయ్...
అలల పైఎద పై నిన్ను ఊయలలు ఊపేందుకే...
❤❤❤❤
✍️అరుణిమలు
No comments:
Post a Comment