ఎదరుగా ఎవరున్నారని ఆ చూపంటే...ఏం చెప్పను
ఎదురు చూసే మనసు ఏదో చూపిస్తుంది, చూడమని...
నాకు మాత్రమే కనిపించే నీడవి కదూ...
నే చిత్రించే భావానివే కానీ భ్రమవు కాదు సుమీ...
కానరానీ దూరాలు ఉన్నది కంటికే కదా...
ఆ ఆకాశం నీడనే ఉన్నాం మనం...
కలిసేది మాత్రం కలల తీరాన..ఊహల వెన్నెలలో...
నిదురని చెరిపి....చెదరని ఙ్ఞాపకాల పంట పండించేది అక్కడే కదా....
కలల సరోవరంలో కలువలమే ఇద్దరం...
ప్రేమనే వెన్నెల జలపాతలలో తడిసే గువ్వలం...
రేయి అనే పలకపై మనం అని లిఖించే అక్షరాలం...
అంతేనా......అంటే, రాసే కొద్ది భావాలు ఊరే చెలమలం ...
నింగిన విహరించే రాయంసలం....
✍️అరుణిమలు
No comments:
Post a Comment