Saturday, 2 December 2017
తాను నేను
మదిలో మదిస్తున్న ప్రశ్నలకు బదులేదని అడిగేందుకు పెదవులకు ధైర్యం లేదు...
బలహీనతను బలంగా మార్చి...మదిని తేలిక చేసేందుకే
మనసు బావిలోని భారాన్ని అక్షరాలుగా తోడుతూ మనల్ని ఆవిష్కరిస్తున్న పదాలలో...
ఇష్టాన్ని కష్టాన్ని కలిపి జోడు కావిళ్ళు చేసి భుజాన ఎత్తుకున్న...
ప్రేమను ఆవేదనను రెండు కళ్ళలో నింపుకుని నిన్ను చూస్తున్న....
ప్రతి రోజు నీకై సరికొత్తగా పుడుతూ
నీలో జీవిస్తూ...నువ్వనే ఆవేధనను హత్తుకుని...
నవ్వులకు నీ ఊహను పూతగా పూసి...
నీతో ఏడడుగులు వేసి...నీ పానుపపై విరినై నలిగి
ఆ నీశీది రేయిలో నా రేడు నీడన నే రాలుతున్నా...
ఇంతకన్నా ఇంకేమని చెప్పేది నేను ఎలా ఉన్నానో నీ మనిషినై ఇక్కడ...
ఏమని చెప్పను నువ్వు తాకిన తనువు...నువ్వు అడుగిడిన మనసు స్థితిగతులు......
అందుకోవాలనే కోరిక లేదీ నాడు... కానీ అణువణువు నీతో నిండిన దేహంతో నే సహజీవనం చేస్తున్న...
నీకై అలంకరించిన ఈ మనసు నీ కోసం తపిస్తుంది కానీ నిను చేరాలని లేదు...
తలపులలో మునకలేసిన మనసుకెన్ని మాసికలో...
దాచి దాగని దాగుడుమూతలు మన మధ్య రాజ్యమేలుతుంటే
నే రచిస్తున్న ఈ తాను నేను సమరం ముగిసేది ఏనాటికో...
✍️అరుణిమలు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment