Saturday, 2 December 2017
తాను నేను
నువ్వు వచ్చే వరకు తెలియదు... నవ్వులకు నగిషీలు చెక్కవచ్చని....
నిన్ను చూసే వరకు తెలియదు..కళ్ళకు కాటుక కూడా అడ్డమని....
నిన్ను తలచే వరకు తెలియదు...తలపులకు తాళం వేయొచ్చని....
నిన్ను దాచుకునే వరకు తెలియదు...నా మనసు ఇంత ఇరుకైనదా అని...
నిన్ను ఇష్టపడే వరకు తెలియదు...ఇష్టాన్ని ఏ కష్టం కరిగించలేదని....
నువ్వు ఎదురు పడేవరకు తెలియదు...సిగ్గులో ఎన్ని సిత్రాలు ఉన్నాయో....
నిన్ను తాకే వరకు తెలియదు...స్పర్శ తనువును కాదు మనసుని తడుముతుందని...
దగ్గరతనం అంటే కలిసి ఉండటం కాదు....ఏ దూరాలు చెరపని,చేర్చలేని తీరం మనమని...
అసలేం తెలుసు నాకు...నువ్వు వచ్చేవరకు నాకు నేనే తెలియదు...
నువ్వు వచ్చాక తెలిసింది...అసలు నేనంటు ఎక్కడ ఉన్నాని...నువ్వు నేనులో నేను ఒక భాగం మాత్రమే అని....
వెలుగులకు నమ్మకాన్ని ఇచ్చేద్దాం...చీకటికి కన్నీటిని ఇచ్చేద్దాం....
మనం మాత్రం ...తాను నేనుగా తనువులు వేరైనా మనసులను ఒకటిగా కలిపి మలిచేద్దాం అరుణిమలను....
✍️అరుణిమలు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment