Saturday, 2 December 2017
తాను నేను
ఎలా ఉన్నావని మనసు అడుగుతుంది...
బదులు రాని బండను నే ఏమని కోరను...
మనసు లేని వారితో లంకె పడితే లంకణమే అవతలి మనసుకు...
ఆవలి తీరాన ఊరిస్తూ...ఉసూరనిపిస్తూ ఆడుకుంటుంది..
మూడు అక్షరాల పదానివి...కానీ మూగదానివే మనసా నువ్వు...
మాటలు వచ్చు పలకడం చేతకాక..ఆడిస్తావు మనుషుల చేత...
నువ్వు ఎలా ఉంటావో చూడాలని ఉందే ఒకసారి...
ఇన్ని శిక్షలు వేస్తున్నావుగా ఎంత కటువుగా ఉంటావో కనిపించవే ఒకసారి...
రెండు వేపుల పదును తేలిన దానివి సుమీ...
వదిలేద్దాం అన్నా కష్టమే...అందుకుందామన్నా కష్టమే...
అచ్చు నీలాంటిదే నా మనసున దాగిన మనసు కూడా...
ఆ మాటకు అర్థమే తెలియదు కదా దానికి...
అర్ధాలకు కొత్త అర్ధాలు చెప్పగలదు కానీ...తానేంటో తెలుసుకోదు కదా...
మధించిన మాటల రాసులలో నుండి మౌనం ఇలా చివరగా పుడుతుంది అని ఆనాడు తెలియలేదు...
తెలిసుంటే మాటలు పలకని మౌన మాల ధరించేదాన్ని...
ఇలా ఇప్పుడు ఈ ఎదురు చూపుల ఎడబాటు ఉండేది కాదు...
నీ క్షేమ సమాచారాల కోసం పరితపింపు ప్రాప్తి అయ్యేది కాదు...
✍️అరుణిమలు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment