Saturday, 2 December 2017
తాను నేను
వసంతాల వాకిట్లో వర్ణాల వయ్యారినై ఒదిగున్న..
సీతాకోకచిలుకలా నా రాముడి కోసం సింగారించుకొని సిగ్గులు అద్దుకున్న...
వాసంత సమీరానివై నువ్వు దరిచేరితే...
దాచేయనా నిన్ను నా దోర వయసు నడుమన
దగ తీర్చని దాహాన్ని నింపు కున్న తుమ్మెదవై, నీవు ఉంటే...
నే దప్పిక తీర్చే తేనియలను పొదువుకున్న పుప్పొడిని కానా..
ఓయ్...ఏమైనా, ఏదైనా ఎలా రూపాంతరం చెందిన నా అంతరాన దాగిన రూపం నీవేనోయ్..
ఏ శిశిరం కళ్ళబడనివ్వని నా'రేడువి నువ్వు...
నా గడసరి తనాన్ని తట్టి లేపిన నా తేనెటీగవు..
చాలు చాలింక నీ వర్ణనలు అంటుంది, బెట్టుచేయనివ్వని నా మనసు...
ఇలా వచ్చి అలా మాయమయ్యే ఇంద్రధనస్సుకు ఇన్ని హంగులే కాదు...
పొగడ్తలు కూడానా అని ప్రకృతి కూడా కుళ్ళు కుంటుంది..
ఆలింగనాల మహోత్సవం మొదలైన వేళ నీ, ఈ ప్రకృతి కాంతకు ఎన్ని హోయలో..
ఏయ్.....రేయి చాటు నా సూరీడా...
కాంతను ఏలగ తొందరగా రావోయ్...
✍️అరుణిమలు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment