Saturday, 2 December 2017
తాను నేను
ఓయ్........
అలా లోకానికి దూరంగా నువ్వు నేననే లోకాన్ని ఒకటి నిర్మించుకున్నాం గురుతుందా...
మాటలో మాటగా...ఊపిరిలో ఊపిరిగా కలిసిపోయాం...
అడుగులో అడుగుగా అడుగడుగునా ఒకటై వేసిన అడుగుల జాడలు ఈ మదిలో ముద్ర పడిపోయాయి...
అల్లరి చేసినా,అలిగినా,కసురుకున్న,హత్తుకున్న ఆఖరుకు కన్నీరుగా కరిగినది నీ ముందరే నీ దగ్గరే...
మళ్ళీ మళ్ళీ చెబుతా నేను నేనుగా ఉన్నది నీతోనే...
ఏ తోడు వద్దనుకున్న జీవితానికి తోడువై నీడగా నా వెంట ఉన్నావు గతమనే ఙ్ఞాపకంలో...
గుండెల నిండా ప్రేముంది..దుఃఖం కూడా ఉంది అందుకే అలికిన కళ్ళకు నా ప్రేమ రూపం కనిపించట్లేదు ఇప్పుడు....
శ్వాసకు మాత్రం నువ్వనే భావం ఆయువును ఇస్తుంది...
రూపం లేని ప్రేమా నీది, అంటే అది నీకే తెలుసు లోకానికి మాత్రం నేను ఒక భ్రమను...
ఆరని ఈ కన్నీరే శాక్షి నువ్వు ఇంకా ఈ మదిలో వాడిపోని ఆశవని...
ఎవరికి చెబుతున్న ఈ కథలు ఇంతకు....
నా జతలో వెలుగులు అద్దుకున్న నా జాబిలికి మాత్రమే..
పొద్దు పొడిస్తే నా నీడవు...రేయిలో నా కొంగు పట్టుకు తిరిగే నా మావవు కదూ...
నువ్వు అనే ఈ ఙ్ఞాపకానికి ఇక్కడ అమృతాన్ని పోస్తునే ఉన్నా, నా ఉప్పు నీటి ఊట బావి నుండి తోడి మరీ...
లవ్ యు అంటే లవ్ యూ నే కాలాలు మారొచ్చు కాని ఈ భావం మారదోయ్ పిచ్చోడ...
✍️అరుణిమలు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment