Saturday, 2 December 2017
తాను నేను
లిపి లేని భాష అసంపూర్ణం...నువ్వు లేని నా ఊహ లా...
నా ఆశ కి ప్రాణం నువ్వు....నా భావాలకు భాషవు నువ్వు...
నా లిపికి రూపానివి నువ్వు...పదాల మాటున నా అనుభవాల ప్రతిబింబం నువ్వు...
నీ ఆలోచనల జడివానలో చిక్కిన చెలిమిని నేను...
నువ్వనే ఙ్ఞాపకాల జడివానలో నిలిచిన మనసును నేను...
ఆ నింగి ఈ నేల సాక్షులేమొ మన బంధానికి..
నా మనసు బీడుగా మారిన ప్రతీసారి,ఇలా నన్ను తేరుకోమని వర్షిస్తుంది..
తెప్పరిల్లమని మదిని తడిమి చెబుతుంది...
చెంపలపై చేరిన చారికలను చెరిపి మరీ స్వాంతన ఇస్తుంది...
కానీ నాలో నువ్వనే రూపాన్ని మాత్రం చెరపలేక మధన పడుతుంది...
ఆరని నా గుండె మంటలను...ఆగని కన్నీటిని మాత్రం చూస్తూ నిరుత్సాంగా వెను తిరుగుతుంది...
కాలమా కాస్త ఇటు చూడవే...నీ చేతలకు నే లేపనాలు పూయలేక పోతున్నా అంటూ చిన్న బుచ్చుకుంటుంది...
నా నిట్టూర్పలను చల్లబరిచే చెలిమివి నువ్వు కావే...
చెరిసగమని కలిసిన చెలిమి చెల్లాచెదురు అయ్యాక..
ఒక్కొక్క చినుకుగా చేరి నన్ను ఊరడించలేవు...
మళ్ళీ రా...మనసును మానసాన ముంచేయడానికి...
✍️అరుణిమలు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment