Saturday, 2 December 2017
తాను నేను
అలసిన మనసుకు, రేయి వక్కను ముక్కలు చేసి తాంబూలం అందిస్తున్న...
చిలకలు చుట్టిన ముంజేతి వేళ్ళను మునిపంటితో కొరికే వేళలో...
ప్రేమకు పరీక్షా సమయం ఇదే కదా...అంటూ సిద్దం కమ్మంటుంది మనసు...
జాగారానికి నజరానాలను కోరనులే ....
రాత్రిని నలిపి కురులకు విరులుగా మలిచి కానుకను చేసి ఇచ్చాక...
అధరాల కొనలలో అధిరిన భావాన్ని నీ కన్నులు పసిగట్టాక...పెదవి తాంబూలం పండినట్టే ఇక...
చల్లని రేయి వెచ్చగా మారి కరిగిపోతానేమో అని మబ్బుల చాటున దాగున్నట్డు నీ ఎద మాటున నే దాగున్న...
నా నగవులు నీ ఎదను చెక్కిన చిత్రాలు ఆరనే లేదు ...ఇక చాలంటు ఆరాటం పెరిగిన భానుడు తొందరపడి మేల్కొన్నాడు...
కనుల తెరిచి చూసానా చుట్టూ.. ఎక్కడ నువ్వంటూ...
మనసు మురిపెంగా తెలిపింది...కలలను ఇలలో వెతకరాదే అని...❤❤❤
✍️అరుణిమలు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment