Saturday, 2 December 2017
తాను నేను
కలిసిపో ఈ కళ్ళలో....కరిగిపో ఈ కాలంలో..❤❤
ఒదిగిపో ఈ ఒడిలో..ఓరవలేని భవిష్యత్తును వెక్కిరిస్తూ..❤❤
వెలుగులను వెలివేద్దాం మన లోగిలికి వెన్నెల నీడలు చాలని...❤❤
మౌనం పెదవులకు ఇచ్చేద్దాం మనసులను మాట్లాడుకోమని...❤❤
తనువులను తరించి పొమ్మందాము ఆ భావాన్ని మనతో విడదీయలేనంత లోతుగా...❤❤
శ్వాసలను ఏకమై పోనీవు నువ్వు నేను వేరుకాదని మనసుకు ఇచ్చేద్దాం భరోసా...❤❤
ప్రేమను ముద్రించేద్దాం మనం కూడా చెరపలేనంత చెలిమిని చెక్కిళ్ళపై...❤❤
కోరికలకు కొసరంటు మిగలనివ్వొద్దు కాంక్షను కొలిచేద్దాం..❤❤
ఆశలకు ఆవిరులు పట్టి కరిగిపోతున్నాయి ఊపిరి సెగలు తగిలి...లిఖిస్తున్న ఆ ఆ'విరిలో నువ్వే నేనని...❤❤
ఓయ్... నే తెలుసుకొని తేరుకునే సరికి కనుమరుగైపో లేదంటే నీ నీడనై పోతాను నేను...❤❤
ఒకమాట ఎంతెంత దూరం నువ్వు వెళ్ళిన...ఎంతెంత దూరాలు మన మధ్య వచ్చిన నువ్వు అనే భావంలో నే బంధీనే ఎప్పటికి 😘😘😘
✍️అరుణిమలు
Subscribe to:
Post Comments (Atom)
మీరు అద్భుతమైన భావాన్ని చాలా సింపుల్ గా చెప్పగలుగుతున్నారు. మీరు ప్రేమలో విఫలం అయ్యారో లేక దాంపత్యంలో విఫలం అయ్యారో తెలియదు కానీ.... మీ బాధ మీ మాటల్లో, మీ అక్షరాలలో పొందుపరచి ఉంది
ReplyDelete