అక్షరానికో బింధువు ఆవిరి అవుతుంది...
ఎదను దిగంతాల అంచులకి తీసుకు పోయి...
అటా, ఇటా అనే ప్రశ్నల నడుమ...
నిజాలను అగాధాలుగా చూపిస్తూ...
వాస్తవాన్ని జీర్ణించే శక్తిని నే ఇస్తా వెనక్కి రమ్మంటూ...
అక్షరాల వారధిని రహదారిగా మలచి చూపిస్తుంది...
మేమున్నాం పంచుకునేందుకంటూ...
మూడో కంటికి చేరనివ్వం అంటూ భరోసాని ఇస్తూనే...
కాగితాన్ని భుజానిగా మలచి ఆసరా ఇస్తున్నాయి...
ఊతగా కాదు నీ బలమై ఉన్నామంటూ....
బరువెక్కిన ఎదను తేలిక చేస్తునే ఉన్నాయి...
కరిగిన ఆ భావాలు సిరా చుక్కగా మారుతూ పదాలను పేరుస్తున్నాయి...
ఈ అనంత లోకంలో ఏకాకిని కానోయ్....నువ్వే అక్షరానిగా మారుతూ నాతో ఉన్నంత వరకు....
✍️అరుణిమలు
No comments:
Post a Comment